తెలంగాణ

Khammam: కోరిక తీర్చాలని రౌడీ షీటర్‌ వేధింపులు.. టార్చర్‌ భరించలేక వివాహిత ఆత్మహత్య

Khammam: ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్‌ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందని బోడ సుశీల పై ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్‌ ధరావత్‌ వినయ్‌ కొంతకాలంగా కన్నేశాడు.

ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి అమ్మపాలెం వెళ్లింది. అక్కడ సుశీలను గమనించిన రౌడీషీటర్‌ ధరావత్‌ వినయ్‌ ఆమె దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగాడు. సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరేసుకుంది.

వినయ్‌ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సుశీల భర్త శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, ఉరేసుకుని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button