ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో 918.6 కోట్లు రూపాయలు వచ్చాయి. అన్నప్రసాదం, శ్రీవాణి ట్రస్ట్‌లకు అత్యధికంగా విరాళాలు అందించారు భక్తులు. ఆన్లైన్ ద్వారానే ఆలయానికి ఎక్కువమంది దాతలు విరాళాలు సమర్పిస్తున్నారు.
దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకూడదని అధికారులను టీటీడీ చైరన్ అదేశించారు. ట్రస్ట్ లకు విరాళాలతో పాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు దాతాలు.



