తెలంగాణ
Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు

Hyderabad: దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షల తెలిపిన ఆయన ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో విలసిల్లాని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో ఈ ఏడాది అసలైన దీపావళి పండుగ జరుపుకుంటున్నారన్నారు. దీపావళి పండుగను ప్రధాని మోదీ సైనికులతో జరుపుకుంటున్నారని తెలిపారు.



