తెలంగాణ
Medaram jathara: ఆర్అండ్బీకి మేడారం జాతర పనులు

Medaram Jatara: మంత్రుల పొలిటికల్ ఫైట్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం జాతర విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర పనులన్నీ ఆర్ అండ్ బీ ద్వారానే చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.
వైర్వేరు మంత్రిత్వ శాఖలు చేసే పనులన్నీ ఆర్ అండ్ బీకి డైవర్ట్ చేశారు. వేర్వేరు శాఖలు పనులను చేపడితే సమన్వయం కష్టమన్న ప్రభుత్వం భావిస్తుంది. మేడారం టెండర్ల విషయంలో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల మధ్య విభేధాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



