కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్ని గెలిపిస్తారా? కాంగ్రెస్ను గెలిపిస్తారా?

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని.. ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు కిషన్ జీ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని గెలిపిస్తారా? కాంగ్రెస్ను గెలిపిస్తారా? అని.. సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు కిషన్ జీ..? ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా..? అసదుద్దీన్ ఓవైసీని అడగాలన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖం ఎలా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతీ నియోజకవర్గం, డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంను చాలామంది వేలెత్తి చూపుతున్నారు. తెలుసా.! అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు.



