పాక్‌కు గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్

వలపు వలలో పడి రాజస్థాన్‌కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. ప్రస్తుతం అతడు జైల్లో ఉండగా దీనిపై సెంట్రల్ ఎంక్వైరీ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థలు విచారణ జరుపుతున్నట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌కు గూఢచార్యం చేస్తున్న పలువురిని భారత నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. ప్రత్యేక తనిఖీలు చేపట్టి చాలా మందిని అదుపులోకి తీసుకున్నాయి. అనుమానాస్పదుల కదలికలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పాక్ కి భారత్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని మోసే గూఢచారులు, భారత్ కి వ్యతిరేకంగా, పాక్ కి అనుకూలంగా పనిచేసే వారు బయటపడుతున్నారు.
ఒక్క మూడు రోజుల్లోనే 11 మంది పాక్ గూఢచారులు అరెస్టయ్యారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్, హర్యానా, యూపీలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మళ్లీ పలువురిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. హనీట్రాప్‌లో చిక్కుకొని రాజస్థాన్‌కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను పంపించాడు. దీంతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అల్వార్‌కు చెందిన మంగత్ సింగ్‌ని అరెస్టు చేసింది. రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పాక్‌కు చెందిన ఇషాశర్మతో మంగత్ సింగ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్ది కాలంలోనే ప్రేమగా మారినట్లు నమ్మించి, ఆ మహిళ అతన్ని ట్రాప్ చేసింది. ఆ పాక్ మహిళ పట్ల ఏర్పడిన మోజుతో మంగత్ సింగ్ ఆమెకు దేశ రక్షణకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించడం ప్రారంభించాడు. అనంతరం పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నాడు.
ఈ లావాదేవీలకు ఉపయోగించే ఆర్థిక మార్గాలను తాము గుర్తించామని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అల్వార్ కంటోన్మెంట్ ఏరియాతో పాటు ఇతర కీలకమైన రక్షణ రంగ వ్యూహాత్మక కేంద్రాలకు సంబంధించిన వివరాలను అతను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ ఎంక్వైరీ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థల బృందాలు సంయుక్తంగా విచారిస్తున్నాయి.
ఇదేవిధంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని సీఐడీ నిఘా విభాగం అరెస్టు చేసింది. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్‌గా పనిచేసే మహేంద్ర పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డీఆర్‌డీఓ వంటి అత్యంత సున్నితమైన రక్షణ సంస్థకు సంబంధించిన అతిథి గృహంలో పనిచేస్తూ పాక్‌కు రహస్య సమాచారాన్ని అందించడం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అంశమని నిఘా అధికారులు తెలిపారు.
గూఢచర్యం, దేశ ద్రోహం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు దేశంలో ఏ మూలన ఉన్నా, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పని చేస్తున్నాయని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు.
కాగా భారత్‌లో పాక్ గూడఛర్యం చేసిన జ్యోతి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జ్యోతితో పాటు పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గజాలా, యమీన్ మహమ్మద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యమీన్ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్ తో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. నుహ్‌కే చెందిన తారిఫ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనకు సిమ్ కార్డులు అందించినట్లు విచారణలో చెప్పాడన్నారు. అతను తరచుగా పాకిస్థాన్ వెళ్లేవాడు.
ఐఎస్ఐ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్న నౌమాన్ ఇలాహీని పానిపట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను యూపీకి చెందినవాడు. ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, పాక్‌కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇలాహీ చాలాసార్లు పాక్ పర్యటనకు వెళ్లాడన్నారు.పంజాబ్‌లోని జలంధర్‌లో యాప్ డెవలపర్ మహ్మద్ ముర్తజా అలీని పోలీసులు అరెస్టు చేశారు. అతను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా గూఢచర్య కార్యకలాపాలను నిర్వహించాడని చెప్పారు.
పంజాబ్ పటియాలాలోని ఖల్సా కళాశాలకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి. పటియాలా సైనిక కంటోన్మెంట్ చిత్రాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లకు అందించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్‌లో పాకిస్థాన్ వెళ్లి వచ్చాడని చెప్పారు. ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు షెహజాద్‌ను అరెస్టు చేశారు. ఇతను పాకిస్థాన్‌కు అనేకసార్లు వెళ్లాడని, సౌందర్య సాధనాల స్మగ్లింగ్ రాకెట్‌ను గూఢచర్య కార్యకలాపాల కోసం వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐఎ్‌సఐ ఏజెంట్లతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని అందజేశారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు గురుదాస్ పూర్ లో సుఖ్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. పంజాబ్, హిమాచల్, కశ్మీర్‌లో భారత దళాల కదలికలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను నిందితుడు ఐఎస్ఐకి చేరవేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, రాజస్థాన్ ఇంటెలిజెన్స్ రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక స్థావరాల సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోంది. అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సమయంలో, మంగత్ సింగ్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించబడింది, దీనితో లోతైన దర్యాప్తు ప్రారంభమైంది. సింగ్ అరెస్టు అయ్యే వరకు తన నిర్వాహకులతో సైనిక సమాచారాన్ని పంచుకుంటూనే ఉన్నాడని డిఐజి ఇంటెలిజెన్స్ రాజేష్ మీల్ అన్నారు. అతను రెండు పాకిస్తాన్ నంబర్లతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపాడని పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నాడని ఈ లావాదేవీలకు ఉపయోగించే ఆర్థిక మార్గాలను తాము గుర్తించామని తెలిపారు.
కాగాసోషల్ మీడియాలో ఇషా శర్మ అనే మారుపేరును ఉపయోగించి ఒక మహిళా పాకిస్తానీ ఆపరేటివ్ ద్వారా మంగత్ సింగ్ హనీ ట్రాప్ చేయబడ్డాడని దర్యాప్తులో తేలింది. భావోద్వేగ తారుమారు, ఆర్థిక ప్రేరణ ద్వారా, హ్యాండ్లర్ సింగ్ నమ్మకాన్ని సంపాదించి, రహస్య సైనిక సమాచారాన్ని పంచుకునేలా ఒప్పించాడు. సింగ్ రెండు పాకిస్తానీ నంబర్లతో సంబంధాలు కొనసాగించాడు – ఒకటి హనీ-ట్రాప్ ఆపరేషన్‌తో ముడిపడి ఉంది. మరొకటి పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్‌లతో నేరుగా అనుసంధానించబడి ఉంది. వారి సంభాషణ సమయంలో, రహస్య సమాచారం కోసం సింగ్ గణనీయమైన ద్రవ్య బదిలీలను అందుకున్నట్లు తెలుస్తోంది.
నిందితుడి మొబైల్ ఫోన్, డిజిటల్ కమ్యూనికేషన్లను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్టోబర్ 10న అతన్ని అరెస్టు చేశారు. జైపూర్‌లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద కేసు నమోదు చేయబడి, సింగ్‌ను CID ఇంటెలిజెన్స్ రాజస్థాన్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతన్ని జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో ప్రశ్నిస్తున్నారు, విచారణ సమయంలో అనేక కీలక ఆధారాలు బయటపడినట్లు నిఘా అధికారులు చెబుతున్నారు.పాక్‌కు గూఢచర్యం చేసేవారు దేశంలో ఏ మూలన ఉన్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.



