తెలంగాణ
Hyderabad: దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

Hyderabad: హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు, కుమారుడితో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీశారు. దీంతో ఆ బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.



