తెలంగాణ
కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎంపీ రఘునందన్ ఫిర్యాదు

కాంగ్రెస్ నేతల ఓటరు కార్డుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచుతుంటే ఈసీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు, కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వెళ్ళాయన్నారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎట్లా అర్హుడవుతాడని అన్నారు. వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



