తెలంగాణ
మంత్రి కొండా సురేఖతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ

తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరణకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. దేవాదాయ శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేశారు.
సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్, మంత్రి సురేఖకు వివరణ ఇచ్చారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. బతుకమ్మ కుంట వేడకులకు మంత్రి సురేఖను, రంగనాథ్ ఆహ్వానించారు.



