ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

చిత్తూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చిన్నేపల్లిలో వాహన తనిఖీల్లో అక్రమ గంజాయి రవాణా బయటపడింది. నిందితుల నుంచి 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి కృష్ణగిరికి ముఠా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకొగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.



