తెలంగాణ
సృష్టిపై ఈడీ కేసు నమోదు

సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత.
గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు.



