తెలంగాణ

Gadwal: దారుణం.. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో భార్య భర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్ (29)పై మరిగే నూనే పోసింది భార్య పద్మ. వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డంతో కర్నూల్ కు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ ఆసుపత్రిలో మరణించాడు. 8 సంవత్సరాల క్రితం వెంకటేశ్ పద్మలకి వివాహం కగా వీరికి ముగ్గురు సంతానం.

వివాహం అనంతరం భార్య,భర్తలు తరుచు గొడవ పడేవారని అందులో భాగంగా ఈ నెల 11వ తేది ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ న వేడినూనె పోయడంతో తీవ్రగాయాలతో కర్నూల్ ఆసుపత్రికీ తరలించారు.కర్నూల్ లో చికిత్స పొందుతు నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించారు. ఈనెల 11వ తేదిన సంఘటన జరిగిన రోజు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్ కు తరలించనట్లు గద్వాల సిఐ టంగుటూరి శ్రీనివాసులు మీడియతో తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button