తెలంగాణ
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.



