ఆంధ్ర ప్రదేశ్
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు

ఇడుపులపాయలో వైసీసీ అధినేత జగన్ పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ప్రార్థనల్లో పాల్గొని వైఎస్‌ను స్మరించుకున్నారు.



