ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఏపీలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇవాళ విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్.. స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు.



