ఆంధ్ర ప్రదేశ్
గోళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలం గోళ్ళపల్లి వద్ద ఇన్నోవా కారు బోల్తాపడి శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మదనపల్లికి చెందిన శ్రీనివాసులు, సాయి గా గుర్తింపు, క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వసుపత్రికి తరలించారు.



