ఆంధ్ర ప్రదేశ్
ఏనుగుల హల్‌చల్.. పంట పొలాలు ధ్వంసం

పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల హల్‌చల్ చేశాయి. గంగిరేగివలస గ్రామంలో జొన్న తోటను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. ఇతర పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతుల కన్నీరు పెడుతున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కారించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



