Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Srisailam: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడం పైగా వరుస సెలవు రావడంతో శ్రావణమాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం శుభ ప్రధమణి భక్తులు భావిస్తారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా పెరుగుతూ ఉండడంతో మల్లన్న స్పర్శ దర్శనాలకు నిలుపుదల చేసిన అధికారులు మల్లన్న స్పర్శ దర్శనాలు,గర్భాలయ అభిషేకా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచి ఉండడం వరుస సెలవు సెలవులు రావడంతో దీనితోపాటు శ్రావణ మాసం శ్రీశైలానికి వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు శీఘ్ర, అతి శీఘ్ర టికెట్లైన150,300,500 ల టికెట్లను తీసుకొని ఆయా క్యూ లైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు, ఆలయంలో మాత్రం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ మిగతా ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని అందులో స్వామివారి ఆలయంలో హోమాలు స్వామి వారి కళ్యాణం ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూలైన్లో ఉండే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. వేకువజాము నుంచే త్వర త్వరగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లో ప్రత్యేక ఏర్పాట్ల చేసాము అని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.



