తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Rajagopal Reddy: మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే పైసలు మీకే అని కొద్దిరోజుల క్రితం అన్నాను ఎవరినన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ని అన్నాను తెలుసు కదా అని కార్యకర్తలతో కోమటిరెడ్డి అన్నారు. మన మునుగోడులో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు సిసి రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదు.
నేను మంత్రి దగ్గర పోయి అడిగినా కూడా రాలే.. వందసార్లు తిరిగినా రాలేదు అంటూ ఆయన మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.



