ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: నయా భారత్ కాదు..మోడీ చేతిలో భారత్ దగా పడ్డాది

YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల ఫైరయ్యారు. నయా భారత్ కాదు..మోడీ చేతిలో భారత్ దగా పడ్డాదని విమర్శించారు.
మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించేందుకు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి ఉందన్నారు. నాడు కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. నేడు చంద్రబాబు పులివెందులతో అదే చేశారని షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఇద్దరు ఖూనీ చేశారని అన్నారు.



