ఆంధ్ర ప్రదేశ్

Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి భూమిపూజ చేసిన బాలకృష్ణ

Balakrishna: రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు ప్రజలందరూ రుణపడి ఉంటారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ..పేద ప్రజలకు సేవ చేసేందుకే ట్రస్ట్ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు.

చంద్రబాబు నాయుడు ప్రపంచానికే బ్రాండ్ అంబాసిడర్ అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ లెగసీని అందిపుచ్చుకుని అభిమానులు, ప్రేక్షకుల మన్ననలతో దశాబ్దాలుగా సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్రమంత్రులు నారాయణ, సత్యకుమార్, మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button