వ్యాపారం
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా, భారత్‌లలో జులై నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. అంతర్జాతీయంగా టారిఫ్‌లకు సంబంధించిన ఆందోళనలు కూడా తోడవడంతో అమ్మకాలకే మొగ్గు చూపారు. ఫలితంగా రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాల్లో స్థిరపడ్డాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 368 పాయింట్లు క్షీణించి 80వేల 235 వద్ద ముగిసింది. అదేవిధంగా,నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 24వేల 487 వద్ద స్థిరపడింది. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.70 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. ముడిచమురు ధరలు పెరగడం రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది.



