తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో వర్షం దంచికొట్టింది. దీంతో ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వార్డు కాలనీ చెరువుల తలపిస్తోంది. ఆ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు పైకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆ ప్రాంతం జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అనేక కాలనీల్లోని అంతర్గత రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు భయం భయంగా వెళ్లారు. రెండు రోజులుగా రాత్రి సమయంలో మోస్తరు వర్షం పడుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.



