తెలంగాణ

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైర్

Talasani: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారని ఆయన విమర్శించారు. తీర్మానం చేశాక 9వ షెడ్యూల్ పెట్టాలన్నారు. రేవంత్‌రెడ్డి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి తాపత్రయం పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కరీంనగర్‌లో బీసీ కదనభేరికి అందరూ కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button