తెలంగాణ
పిడుగుపాటుకు ఏడు ఆవులు మృతి

కొమురం భీం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 7 ఆవులు మృతిచెందాయి. కైరిగూడ ప్రాంతానికి చెందిన రైతుల ఆవులు, దూడలు అడవిలో మేతకు వెళ్లిన సందర్భంలో పిడుగుపడి మృతి చెందాయి. ఆర్థిక ఆధారమైన ఆవులు మృతిచెందడంతో ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.



