తెలంగాణ
Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా

Bandi Sanjay: కాంగ్రెస్ ధర్నాపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని తెలిపారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.



