రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ హెచ్చరిక

Donald Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి మీరూ కొంటున్నారని ట్రంప్‌ను భారత్ ప్రశ్నించింది. అమెరికా తీరుపై భారత్ ఎత్తి చూపడంతో ట్రంప్ నీళ్లు నమిలాడు. భారత వాదనపై స్పందిస్తూ, ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. దానిపై నేను ఒకసారి చెక్ చేయాలని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
అదే సమయంలో తమ దేశం రష్యా నుంచి చేస్తున్న దిగుమతులపై మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తోందన్న భారత వాదనపై స్పందిస్తూ, “ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. దానిపై నేను ఒకసారి చెక్ చేయాలని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు భారత్‌ను విమర్శిస్తూనే, మరోవైపు అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలు వంటి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని భారత్ ఎత్తి చూపింది.
తమ దేశ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగానే తాము రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని గుర్తు చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు తొలుత అమెరికాయే తమను ప్రోత్సహించిందని కూడా భారత్ వాదించింది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్యం, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్టతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.



