ఆంధ్ర ప్రదేశ్

Nagar kurnool: గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌.. 64మంది బాలికలకు అస్వస్థత

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థినులకు స్నాక్స్ పకోడి అందించారు. క్యాబేజీ కూరతో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే తొమ్మిది మంది విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు.

ఆ తర్వాత క్రమంగా విద్యార్థినుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఆర్డీవో సురేశ్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button