తెలంగాణ

KCR: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయులు మానిటర్‌ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు.

కేసీఆర్ రెండురోజులపాటు నందినగర్ నివాసంలోనే ఉండనున్నట్లు సమాచారం. రేపు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నీటివివాదాలపై స్పందించే అవకాశం కన్పిస్తోంది. నిన్న పరామర్శకు వచ్చిన నేతలతో కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button