జూనియర్ టీజర్: యూత్‌ఫుల్ ఎనర్జీ సందడి!

Junior: ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జూనియర్’ టీజర్ విడుదలయ్యి ఆకట్టుకుంటుంది.
గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి రెడ్డి తొలి చిత్రం ‘జూనియర్’తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ టీజర్‌లో కిరీటి ఎనర్జిటిక్ లుక్, డాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. శ్రీలీలతో ఆయన కెమిస్ట్రీ ఆసక్తికరంగా కనిపిస్తోంది.
జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్రలో రీ-ఎంట్రీ ఇస్తూ టీజర్‌కు మరింత ఆకర్షణ తెచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీతో కూడిన ఈ చిత్రం యువతను ఆకట్టుకోనుంది. జూలై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలకు సిద్ధమవుతోంది.