సినిమా
Lenin: లెనిన్ కొత్త షెడ్యూల్ రెడీ!

Lenin: అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా కోసం టీమ్ మంచి కీలక షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలో కనిపించనున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, నవంబర్ 14న రిలీజ్ కానుంది.
అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘లెనిన్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, తిరుపతిలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేసిన యూనిట్, లొకేషన్లను ఖరారు చేసింది.
చిత్తూరు నేపథ్యంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసతో అదరగొట్టనున్నాడు. హీరోయిన్ శ్రీలీలతో అఖిల్ కెమిస్ట్రీ, లవ్ సీన్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. నవంబర్ 14న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.