తెలంగాణ
తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు..!

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, మత్స్య, లా, యూత్ శాఖలు కేటయిస్తారని టాక్ వినబడుతోంది.
అడ్ల్మూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగు తోంది. అదేవిధంగా గడ్డం వివేక్కి లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న మూడు శాఖల స్థానాలపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు.



