జాతియం
యూపీలో పాక్ గూఢచారి అరెస్ట్

యూపీలో పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. ISI కోసం గూఢచర్యం చేస్తున్న షెహజాద్‌ని అరెస్ట్ చేశారు. మొరాదాబాద్‌లో ‘యూపీ ఏటీఎస్’ షెహజాద్‌ను అదుపులోకి తీసుకుంది. షెహజాద్ వ్యాపారం ముసుగులో గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ నుంచి కాస్మొటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను భారత్‌కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షెహజాద్.
ఈయన పలుమార్లు పాక్‌కు రాకపోకలు సాగించినట్లు అదేవిధంగా ISIతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ISI ఆదేశాలతో భారత్‌లోని పాక్ ఏజెంట్లకు నిధుల సరఫరా చేశాడు. పలువురు యువకుల్ని సైతం పాక్‌కు పంపించాడు షెహజాద్. ఇక షెహజాద్ భారత సిమ్ కార్డులను ISIకి చేరవేసినట్లు ‘యూపీ ఏటీఎస్’ తేల్చింది.