సినిమా
SS Rajamouli: RRR 2తో రాజమౌళి మరో సంచలనం?

SS Rajamouli: ‘RRR’ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ‘RRR 2’తో మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా మేనియా ఇప్పటికీ కొనసాగుతోంది. గత కొంతకాలంగా ‘RRR 2’పై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో రాజమౌళి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మొదటి భాగాన్ని మించేలా ‘RRR 2’ను తీర్చిదిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్, రిలీజ్ డేట్స్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. భారతీయ సినిమా సత్తాను మరోసారి చాటేందుకు ‘RRR 2’ సిద్ధమవుతోంది.