తెలంగాణ
MLC Kavitha: నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం

MLC Kavitha: బీసీల హక్కులు సాధించేందుకు 72 గంటల దీక్ష చేపట్టామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకు పోలీస్ శాఖ సానుకూలంగా అనుమతి ఇవ్వాలని కోరారు. తన దీక్షకు ఆటంకం కలిగించి హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించబోనని పట్టుబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్లు అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్‌లో సైతం దీక్షకు దిగుతామని కవిత స్పష్టం చేశారు.



