Kingdom: కింగ్డమ్ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా రూపొందుతున్న భారీ చిత్రం “కింగ్డమ్” రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి, ఈ సినిమా రిలీజ్‌పై లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం.
విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్డమ్” చిత్రం మే 30న రిలీజ్ కావాల్సి ఉండగా, ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. మేకర్స్ తాజాగా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అదనపు ఆకర్షణ.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు హైప్‌ను పెంచాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ వాయిదా వేసినప్పటికీ, జూలై 4న ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ యాక్షన్ అవతార్‌తో అభిమానులకు పండగ చేయనున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.