ప్రభాస్ “రాజా సాబ్” టీజర్ వాయిదా? ఫ్యాన్స్ నిరాశ!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ది రాజా సాబ్” గురించి తాజా అప్డేట్ ఫ్యాన్స్‌లో నిరాశ పుట్టిస్తోంది. ఈ హార్రర్ కామెడీ చిత్రం టీజర్‌పై వచ్చిన వార్తలు ఏంటో తెలుసుకుందాం.
దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “ది రాజా సాబ్” చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టించింది. హార్రర్, కామెడీ జోనర్లో ప్రభాస్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
మే నెలలో టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్లో ఉన్న ప్రభాస్ ఇప్పట్లో ఇండియా తిరిగి రావడం కష్టమని తెలుస్తోంది. దీంతో టీజర్ రిలీజ్ ఆలస్యం కావచ్చనే టాక్ నడుస్తోంది. అయినప్పటికీ, సినిమాపై బజ్ తగ్గదని ప్రభాస్ ధీమాగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రభాస్ లేదా మేకర్స్ నుంచి అధికారిక స్పందన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.