ఆంధ్ర ప్రదేశ్
ఒంటరి ఏనుగు హల్చల్.. అటవీశాఖ అధికారిపై దాడి

చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అటవీశాఖ అధికారిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఎఫ్ఆర్వో సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. జనవాసాల మధ్య ఏనుగు ప్రత్యేక్షం కావడంతోప్రజలు భయాందోళనకు గురైతున్నారు. ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.



