ఆంధ్ర ప్రదేశ్

Train Fire: టాటా ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం

Train Fire: టాటా ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనంటాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దువ్వాడ సమీపంలో భయానక అగ్నిప్రమాదం జరిగింది. ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగగా, లోకో పైలట్లు పొగను గమనించి రైలును ఎలమంచిలి సమీపంలో ఆపేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో B1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోగా, ప్రయాణికులను సామర్లకోటకు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button