Danam Nagender: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా

Danam Nagender: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కారు గుర్తుపై గెలిచిన దానం కాంగ్రెస్‌లో చేరినట్లు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. చాలా రోజుల నుంచి ఫిరాయింపు ఫిర్యాదుపై చర్యలు లేవు. కాని ఇప్పుడు దానం నాగేందరే స్వయంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు ప్రకటించడం విశేషం. గతంలో ఆయన కాంగ్రెస్ ఎంపీగానూ పోటీచేసి ఓడిపోయారు. అనర్హత వేటు పడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇబ్బందులు వస్తాయని దానం అనుకుంటున్నారా?
రాజీనామా చేస్తే అనర్హత ఇష్యూఅటకెక్కుతుందని దానం భావిస్తున్నారా అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే దానం నాగేందర్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఉన్నత పదవి సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అనర్హత అంశం, జీహెచ్ఎంసీ ఎన్నికలు, దానం నాగేందర్ రాజీనామా చేస్తే వచ్చే రాజకీయ మార్పులపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.



