ఆంధ్ర ప్రదేశ్
Jagan: వినాశ ఆర్ధిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం

Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. వినాశకర ఆర్ధిక విధానాలు, అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుందన్నారు. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నారు.
496 గనులను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు తీసుకున్నారని ఆరోపించారు జగన్. ఏపీఎండీసీ ద్వారా అప్పులు సృష్టించారని లక్షా 91వేల కోట్ల విలువైన గనులు తాకట్టు పెట్టి 9 వేల కోట్ల అప్పు చేశారని జగన్ ట్వీట్ చేశారు.