ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

ఏపీలోని శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 69 వేల 962 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 5 వేల 315 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880.50 అడుగుల వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 190 టీఎంసీలు నీరు నిలువ ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button