HICCలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్-2025

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 కేవలం చర్చకు సంబంధించినది విషయమే కాదు. ఇది హైదరాబాద్ బాధ్యతాయుతంగా అభివృద్ధి చెందుతోందన్న అనేక విషయాలను ప్రపంచానికి చాటి చెప్పే వేదిక. ఇండస్ట్రీ ప్రముఖుల సాహసోపేతమైన చర్యలను ఇక్కడ చర్చిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ను పునర్నిర్వచించటానికి… మారుతున్న ప్రజల ఆలోచన ధోరణిని ఈ వేదిక అన్వేషిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 2025 రియల్ ఎస్టేట్ సమ్మిట్ ఒకే గేమ్ చేంజర్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే రాజ్‌న్యూస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్త ప్రాజెక్టులు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి..? కొత్తగా ఇళ్లుగానీ, స్థలాలుగానీ కొనాలన్నది తెలుసుకోడానికి అవకాశం లభిస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, ఫోర్త్ సిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ, కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఎలివేటెడ్ కారిడార్స్‌తో పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ చర్యల కారణంగా, నగరంలో చుట్టుపక్కలా రియల్ ఎస్టేట్ డెవలప్ చెందుతుందన్న విషయాలను తెలుసుకోడానికి ఇదో గొప్ప అవకాశం.
రియల్ ఎస్టేట్ మార్కెట్ కేవలం అమ్మడం, కొనుగోలుకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది మానవాభివృద్ధికి సంబంధించిన అంశం. జనబాహుళ్యానికి అవకాశాలను సృష్టించడం, కొత్తగా కొంగొత్తగా ఎలా జీవించాలన్న ప్రశ్నలకు సమాధానాలిక్కడ లభిస్తాయి. లక్షలాది ప్రజల భవిష్యత్ రూపకల్పనకు రియల్ ఎస్టేట్ మార్గనిర్దేశనం చేస్తుంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు. రేపటి హైదరాబాద్‌ను మహాత్తర నగరంగా తీర్దిదిద్దేందుకు వేదిక. డెవలపర్ అయినా, ఇన్వెస్టర్ అయినా, పాలసీ మేకర్ ఐనా, ఇంటిని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి అయినా.. ఇక్కడ ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేకత ఉంది. రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రచారానికి, అవాస్తవాల చెక్ పెట్టేందుకు ఇదో వేదిక.