తెలంగాణ

అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

TG Assembly: అసెంబ్లీలో బిఆర్ఎస్ నిరసన రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేస్తూ నిరసన.

రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం! “రెండు లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర!” “రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్!” అంటూ బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన. రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీలో తమ నిరసనను కొనసాగించారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. రెండు లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు.

రుణమాఫీ బూటకం కాంగ్రెస్ నాటకం అంటూ నినాదాలు చేశారు. రెండు లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర, రెండు లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button