ఆంధ్ర ప్రదేశ్
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీమిండియా మహిళల జట్టు

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం అర్చకుల వేదమంత్రాలతో స్వామివారి చిత్ర పటం, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.



