ఆంధ్ర ప్రదేశ్
ఏపీ శాసన మండలిలో గందరగోళం

ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే.. ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం నెలకొనడంతో మండలిని ఛైర్మన్ వాయిదా వేశారు.



