తెలంగాణ
జంట జలాశయాలకు భారీగా వరద.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేత

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను జిహెచ్ఎంసి అధికారులు అలెర్ట్ చేశారు . వర్షం కారణంగా అంబర్‌పేట ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ముసారాంబాగ్ వంతెన వద్ద వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది.
ఇటు పాదాచారులు మాత్రం ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఏమైనా సంఘటన జరుగితే ఎవరిది బాధ్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.



