ఆంధ్ర ప్రదేశ్
ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మత్రులు, ఆర్ఎండ్బీ మినిస్టర్ బీసీ జనార్థన్ రెడ్డి, టీ. జి. భరత్, పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా ఈ నెల 16న ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు రానున్నారు. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో ప్రధాని పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.



