ఆంధ్ర ప్రదేశ్
అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠా గుట్టురటైంది. క్రిప్టో కరెన్సీతో డబ్బులు సంపాదిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఏపీ సీఐడీ ఐజీ రవికృష్ణ. గుంతకల్లు, బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసుల దాడిలో ఈ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఐజీ రవికృష్ణ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల అమ్మా యిలే నిందితుల టార్గెట్ అని చెప్పారు. అమ్మాయిలకు డబ్బు ఆశచూపుతున్నట్లు వెల్లడించారు. యేడాదిన్నర నుంచి ఈ వ్యాపారం కొనసాగుతోందని ఇక ఈ కేసులో నేషనల్ ఏజెన్సీలను సంప్రదిస్తామన్నారు ఐజీ రవికృష్ణ.