ఆంధ్ర ప్రదేశ్
PM Modi: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న మోదీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో ఉన్న సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు.
భగవాన్ సత్యసాయి బాబా జీవితం, బోధనలు, సేవలకు స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ సహా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు.



